Naa Koduka Song Lyrics penned by Nanda Kishor, Sung by Sinduri Vishal and Music composed by Devi Sri Prasad from the latest and hit movie “KUBERAA“. Released in 5 Languages Pan India. Starring King Nagarjuna Akkineni, Dhanush, Rashmika in lead roles.
Naa Koduka Song Lyrics in Telugu
పచ్చ పచ్చని చెల్లల్లో
పూసేటి పువ్వుల తావుల్లో
నవ్వులు ఏరుతు నడిచేద్దాము
చేతులు పట్టుకో నా కొడుకా..
కడుపున నిన్ను దాచుకుని
నీడల్లే నిన్ను అంటుకుని
కలిసే ఉంటా ఎప్పటికీ
నీ చేతిని వదలను నా కొడుకా..
పదిలంగా నువ్వు నడవలే
పది కాలాలు నువ్వు బతకాలే
చందమామకు చెబుతున్నా
నిను చల్లగా చూస్తాది నా కొడుకా
ఆకలితో నువ్వు వస్తుంటే
నీ డొక్కలు ఎండిపోయేరా
చెట్టు చెట్టుకి చెబుతున్నా
నీ కడుపు నింపమని నా కొడుకా..
నిద్దురలేక నువ్వుంటే
నీ కన్నులు ఎర్రగా మారేరా
నీలి మబ్బుతో చెబుతున్నా
నీ జోల పాడమని నా కొడుకా..
మనిషికీ మనిషి దూరమురా
ఇది మాయా లోకపు ధర్మమురా
బడిలో చెప్పని పాఠం ఇదిరా
బతికే నేర్చుకో నా కొడుకా..
తిడితే వాళ్లకే తాగిలేను
నిను కొట్టిన చేతులు విరిగేను
ఒద్దిక నేర్చి ఓర్చుకునుండు
ఓపికతోటి నా కొడుకా..
రాళ్ళు రప్పల దారులు నీవి
అడుగులు పదిలం ఓ కొడుకా
మెత్తటి కాళ్ళు ఒత్తుకు పోతాయి
చూసుకు నడువురా నా కొడుకా..
చుక్కలు దిక్కులు నేస్తులు నీకు
చక్కగా బతుకు ఓ కొడుకా
ఒక్కనివనుకొని దిగులైపోకు
పక్కనే ఉంటా నా కొడుకా..
పాణము నీది పిట్టల తొటిది
ఉచ్చుల పడకు ఓ కొడుకా
ముళ్ళ కంపలో గూడు కట్టేటి
నేర్పుతో ఎదగరా నా కొడుకా..
ఏ దారిలో నువ్వు పోతున్నా
ఏ గండం నీకు ఎదురైనా
ఏ కీడు ఎన్నడు జరగదు నీకు
అమ్మ దీవెనిది నా కొడుకా..
ఈ దిక్కులు నీతో కదిలేను
ఆ చుక్కలే దిష్టి తీసేను
ఏ గాలి ధూళి సోకదు నిన్ను
అమ్మ దీవెనిది నా కొడుకా..
ఏ పిడుగుల చప్పుడు వినపడినా
ఏ బూచోడికి నువ్వు భయపడినా
ఈ చీకటి నిన్నేం చేయ్యదులేరా
అమ్మ దీవెనిది నా కొడుకా..
అమ్మ దీవెనిది నా కొడుకా..
Also Read Popular Lyrics:
Song Credits:
సినిమా పేరు: కుబేర (Kubera)
పాట పేరు: నా కొడుకా (Naa Kodukaa)
గాయకుడు: సిందూరి విశాల్ (Sinduri Vishal)
సంగీతం: దేవి శ్రీ ప్రాసాద్ (Devi Sri Prasad)
సాహిత్యం: నంద కిషోర్ (Nanda Kishor)
నటి నటులు: కింగ్ నాగార్జున (King Nagarjuna) అక్కినేని, ధనుష్(Dhanush), రష్మిక మందన్న (Rashmika Mandanna), etc.
దర్శకుడు: శేఖర్ కమ్ముల (Sekhar Kammula)
నిర్మాతలు: సునీల్ నారంగ్ (Suniel Naarang)
ఇలాంటి పాటల కోసం పెరుమాళ్ టెక్ లిరిక్స్ ను సందర్శించండి.
Naa Koduka Song from Kuberaa – FAQs:
Q: Who is the Lyricist of Naa Koduka Song Kubera?
Ans: Nanda Kishor
Q: Who is the Music composer of Kubera Movie Naa Koduka Song?
Ans: Devi Sri Prasad
Q: Who sung the kubera Naa Koduka Song?
Ans: Sinduri Vishal